Andhra PradeshHome Page Slider

రూ.2,79,279 కోట్లతో బుగ్గన భారీ బడ్జెట్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బుధవారం అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి 2023-24 ఆర్థిక సంవత్సరానికి మొత్తం రూ.2,79,279 కోట్లతో వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అన్ని వర్గాల సంక్షేమంతోపాటు సమగ్రాభివృద్ధికి బడ్జెట్‌ ధ్యేయంగా ఉందన్నారు. మరోవైపు టీడీపీ సభ్యుల తీరుపై స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బడ్జెట్‌ను అడ్డుకోవడం సరికాదని, ఇష్టం లేకుంటే ఇంటి నుంచి బయటకు రావాలని సూచించారు. బడ్జెట్‌ను పదే పదే అడ్డుకోవడంతో ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు. రెవెన్యూ వ్యయం రూ.2,28,540 కోట్లు, మూలధన వ్యయం రూ.31,061 కోట్లు, రెవెన్యూ లోటు రూ.22,316 కోట్లు, ఆర్థిక లోటు రూ.54,587 కోట్లుగా బుగ్గన ప్రకటించారు. జీఎస్‌డీపీలో రెవెన్యూ లోటు 3.77 శాతంగా, ఏపీ ఆర్థిక లోటు 1.54 శాతంగా పేర్కొన్నారు.

వైఎస్ఆర్ రైతు భరోసా రూ.4,020 కోట్లు
జగనన్న విద్యా దీవెన రూ.2,841.64 కోట్లు
వైఎస్ఆర్-పీఎం బీమా యోజన- రూ.1600 కోట్లు
డ్వాక్రా సంఘాలకు వడ్డీలేని రుణాలు రూ.1,000 కోట్లు
రైతులకు వడ్డీలేని రుణాలు రూ.500 కోట్లు
వైఎస్ఆర్ కాపు నేస్తం- రూ. 550 కోట్లు
జగనన్న చేదోడు-రూ.350 కోట్లు
వైఎస్ఆర్ వాహనమిత్ర-రూ.275 కోట్లు
వైఎస్ఆర్ నేతన్న నేస్తం-రూ.200 కోట్లు
వైఎస్ఆర్ మత్స్యకార భరోసా- మత్స్యకారులకు రూ.125 కోట్లు
డీజిల్ సబ్సిడీ రైతు కుటుంబాలకు రూ.50 కోట్లు
రైతుల కుటుంబాలకు పరిహారం-రూ.20 కోట్లు
లా నేస్తం- రూ.17 కోట్లు
జగనన్న తోడు- రూ.35 కోట్లు
ఈబీసీ నేస్తం- రూ.610 కోట్లు
వైఎస్ఆర్ కళ్యాణమస్తు- రూ.200 కోట్లు
వైఎస్ఆర్ ఆసరా- రూ.6700 కోట్లు
వైఎస్ఆర్ చేయూత -రూ.5000 కోట్లు
అమ్మ ఒడి – రూ.6,500 కోట్లు
డీబీటీ పథకాలకు మొత్తం రూ.54,228.36 కోట్లు
ధర స్థిరీకరణ నిధులు – రూ.3,000 కోట్లు
వ్యవసాయ యాంత్రీకరణ- 1,212 కోట్లు
మనబడి నాడు-నేడుకు రూ. 3,500 కోట్లు
జగనన్న విద్యా కానుక రూ.560 కోట్లు
పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి – రూ.15,873 కోట్లు
మున్సిపల్ మరియు పట్టణాభివృద్ధి రూ.9,381 కోట్లు
నైపుణ్యాభివృద్ధి – రూ. 1,166 కోట్లు
యూత్ డెవలప్‌మెంట్, టూరిజం మరియు కల్చర్ శాఖ – రూ. 1,291 కోట్లు
షెడ్యూల్ కులాల సంక్షేమం – రూ.20,005 కోట్లు
షెడ్యూల్ తెగల సంక్షేమం – రూ. 6,929 కోట్లు
వెనుకబడిన తరగతుల సంక్షేమం – రూ. 38,605 కోట్లు
కాపు సంక్షేమం – రూ.4,887 కోట్లు
మైనారిటీల సంక్షేమం – రూ. 4,203 కోట్లు
పేదలందరికీ ఇళ్లు రూ.5,600 కోట్లు
పరిశ్రమలు, వాణిజ్యం – రూ.2,602 కోట్లు
రోడ్లు మరియు భవనాల శాఖ – రూ.9,118 కోట్లు
నీటి వనరుల అభివృద్ధికి (నీటిపారుదల) – రూ.11,908 కోట్లు
పర్యావరణం, అటవీ శాస్త్ర సాంకేతిక శాఖ- రూ.685 కోట్లు
ఇంధనం – రూ.6,456 కోట్లు
గ్రామ, వార్డు సచివాలయ శాఖ- రూ.3,858 కోట్లు
గడప గడపకు మన ప్రభుత్వం- రూ.532 కోట్లు