ఎంపీ విజయసాయిరెడ్డిపై సీజేఐకి ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి లేఖ
ఎంపీ విజయసాయిరెడ్డిపై సీజేఐకి ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి లేఖ రాశారు. సీబీఐ, ఈడీ కేసుల్లో విజయసాయి నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు. పదేళ్లుగా బెయిల్ పై ఉంటూ షరతులు ఉల్లంఘిస్తున్నారని పేర్కొన్నారు. న్యాయవ్యవస్థలో న్యాయం జరక్కుండా నిరోధించే అంశాలపై విచారించాలన్నారు. విజయసాయిరెడ్డిపై 11 అభియోగాలు, పలు సెక్షన్ల కింద కేసులున్నాయన్నారు. సీఎం జగన్, ఎంపీ విజయసాయిరెడ్డి పదేళఅలుగా బెయిల్ పై ఉన్నారన్నారు. ప్రతి కేసులో విచారణ జరక్కుండా ఆలస్యం చేస్తూ నిరోధిస్తున్నారన్నారు. పదేపదే వాయిదాలతో విచారణకు రాకుండా ఉంటున్నారన్నారు.

