ఇవాళ అరగంట వాయిదా పడ్డ ఏపీ అసెంబ్లీ
ఏపీలో నేడు ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు అరగంటపాటు వాయిదా పడ్డాయి.అయితే వాయిదా అనంతరం సభ ప్రారంభం కాగానే శాంతిభద్రతలపై సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా సీఎం నిన్న కూడా అసెంబ్లీలో మద్యం పాలసీపై శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో మద్యం పాలసీపై జరిగిన అవినీతిపై సీఐడీ విచారణ చేయిస్తామని పేర్కొన్నారు.

