పల్నాడు జిల్లాలో యాంటీ ర్యాగింగ్, యాంటీ డ్రగ్స్ అవగాహనా సదస్సు
పల్నాడు జిల్లా నరసరావుపేటలో యాంటీ ర్యాగింగ్ మరియు యాంటీ డ్రగ్స్ పై అవేర్నెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు జిల్లా జడ్జిలు. డిస్ట్రిక్ట్ లీగల్ అథారిటీ అండ్ స్టేట్ లీగల్ అథారిటీ ఆదేశాలు మేరకు ఈరోజు నర్సరావుపేటలో స్థానిక రైల్వే స్టేషన్ నుంచి మున్సిపల్ ఆఫీస్ వరకు యాంటీ డ్రగ్స్ మరియు యాంటీ ర్యాగింగ్ అవగాహన ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా జడ్జ్ సత్యశ్రీ మాట్లాడుతూ “నరసరావుపేట గడిచిన కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియాలో యాంటీ ర్యాగింగ్ వీడియో వైరల్ అయిన సంగతి అందరికీ తెలిసిందే డిస్టిక్ లీగల్ అథారిటీ మరి స్టేట్ లీగల్ అథారిటీ వారి ఆదేశాల మేరకు ఈ రోజు నరసరావుపేటలో యాంటీ డ్రగ్స్ మరియు యాంటీ ర్యాగింగ్ పై ప్రజలలో అవేర్నెస్ పెంపొందించడానికి పట్టణంలో ఉన్న విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఈ ర్యాలీ యొక్క ఉద్దేశం ప్రజలందరికీ భరోసా కల్పించడం మా జ్యూడిషరీగా బాధ్యత ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఎక్కడైనా జరిగితే దీనిపై కఠిన చర్యలు ఉంటాయి” అని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో పలువురు జడ్జిలు, ఆశీర్వాదం, మధుస్వామి, ప్రవళిక, మరియు న్యాయవాదులు,విద్యార్థులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు.

