NewsTelangana

తెలంగాణాలో యాంటీ మావోయిస్టు ఆపరేషన్

ఇటీవల కాలంలో తెలంగాణాలో  మావోయిస్టులు పట్టుబడడం కలకలం సృష్టించింది. దీంతో తెలంగాణాలోని పోలీసు అధికారులు అప్రమత్తమయ్యారు. కాగా డీజీపీ మహేందర్ రెడ్డి రాష్ట్రంలో మావోయిస్టుల కదలికలపై ఈ రోజు సమీక్ష నిర్వహించారు. తెలంగాణాలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలయిన ములుగు,మహబూబాబాద్,భద్రాద్రి,భూపాలపల్లిలోని ఐఎఎస్ అధికారులతో డీజీపీ సమావేశమయ్యారు. సమావేశానంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ..రాష్ట్రాన్ని మావోయిస్టు రహితంగా ఉంచుతామన్నారు. తెలంగాణా రాష్ట్రంలో ఇప్పటికే యాంటీ మావోయిస్టు ఆపరేషన్ చేపట్టినట్టు డీజీపీ తెలిపారు. అయితే కొంతమంది మావోయిస్టులు అజ్ఞాతంలో ఉన్నారన్నారు. వారు కూడా జనజీవన స్రవంతిలో కలవాలని డీజీపీ సూచించారు. ప్రస్తుతం రాష్ట్రంలో మావోయిస్టు కదలికలపై అంతరాష్ట్ర బలగాలతో జాయింట్ ఆపరేషన్ జరుగుతోందన్నారు. వయసుపైబడిన మావోలు అనారోగ్యంతో బాధపడుతున్నట్లు సమాచారం అందిందన్నారు. కాబట్టి మావోలు ఇప్పటికైనా లొంగిపోతే వారికి పునరావాసం కల్పిస్తామని డీజీపీ మహేందర్ హామీ ఇచ్చారు.