క్రికెట్ బెట్టింగ్‌కు మరో యువకుడు బలి
క్రికెట్ బెట్టింగ్‌కు మరో యువకుడు బలి అయ్యాడు. బెట్టింగ్‌లో డబ్బులు పోగొట్టుకుని సోమేశ్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధి గౌడవెల్లిలో ఈ ఘటన జరిగింది. గుండ్లపోచంపల్లికి చెందిన సోమేశ్.. క్రికెట్ బెట్టింగ్‌లో రూ.2 లక్షలు పోగొట్టుకుని మనోవేదనతో రైలు పట్టాలపై పడుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.