ఆన్‌లైన్ బెట్టింగ్‌కు మరో యువకుడు బలి..
తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో విషాదం జరిగింది. జిల్లాలోని మర్పల్లి మండలం కోటమర్పల్లికి చెందిన బోయిని విజయ్ కుమార్ (23) ఆన్లైన్ బెట్టింగ్‌లో రూ.3 లక్షలు నష్టపోయి, అప్పులు చేశాడు. అప్పులిచ్చిన వారు డబ్బులు అడగడంతో మనస్థాపానికి గురై, కొత్లాపూర్ సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.