Home Page SliderNational

“బాలయ్య 109” మరో యంగ్ హీరోయిన్?

నందమూరి బాలకృష్ణ హీరోగా ఇప్పుడు దర్శకుడు కొల్లి బాబీ కాంబినేషన్‌లో చేస్తున్న ప్రాజెక్ట్ గురించి తెలిసిందే. మరి ఈ చిత్రం బాలయ్య కెరీర్‌లో 109వ సినిమాగా ప్లాన్ చేస్తుండగా ఈ చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సాలిడ్ మాస్ మూమెంట్స్‌తో ఫుల్ స్వింగ్‌లో సినిమా షూటింగ్ జరుగుతోంది. అయితే ఈ చిత్రంలో బాలయ్య సరసన ప్రముఖ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ నటిస్తోంది. అఫీషియల్‌గా ఎలాంటి క్లారిటీ లేదు కానీ ప్రగ్యా అయితే సైలెంట్‌గా తనపని తాను చేసుకుంటూ పోతోంది. ఇక లేటెస్ట్‌గా ఈమె కాకుండా మరో యంగ్ హీరోయిన్ కూడా రంగంలోకి దిగినట్టు రూమర్స్.. దీంతో ఆ రెండో హీరోయిన్‌గా జెర్సీ ఫేమ్ శ్రద్దా శ్రీనాథ్ నటిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇంకా దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్  అలాగే ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ వారు నిర్మాణం చేపట్టిన సంగతి తెలిసిందే.