News AlertTelangana

కుటుంబ నియంత్రణ ఆపరేషన్… మరో మహిళ మృతి

తెలంగాణలో మరోసారి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వికటించింది. పాత బస్తీలోని పెట్ల బురుజు మెటర్నిటీ ఆసుపత్రిలో రెండురోజుల క్రితం వైద్యులు ఓ మహిళకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేసిన తర్వాత మొదట్లో ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉంది. మర్నాడు నుంచి ఆమెకు జ్వరం, వాంతులు, విరోచనాలు రావడం మొదలయ్యాయి. ఆమెను మెరుగైన వైద్యం కోసం వెంటనే ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమెకు వైద్యం అందించారు. చికిత్స పొందుతూ దురదృష్టవశాత్తు ఆ మహిళ ప్రాణలు విడిచారు. ఆ మహిళ మృతి వెనుక కారణాలను అధికారులు ఆరా తీస్తున్నారని సమాచారం.

ఇటీవల రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ 34 మంది మహిళలకు చేయగా, నలుగురు మృతి చెందారు. మిగతా మహిళల ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో, వెంటనే ఇతర ఆసుపత్రులకు తరలించి వారికి మెరుగైన చికిత్స అందించారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయినప్పటికి వైద్యుల్లో మార్పు రానట్టు కనిపిస్తోంది. వైద్యల నిర్లక్ష్యనికి ఇప్పుడు మరో మహిళ ఈ కు. ని. ఆపరేషన్ కారణంగా మృతి చెందింది.