అక్కినేని ఇంట మరో పెళ్లి బాజా..వధువు ఎవరో తెలుసా ?
అక్కినేని ఇంట్లో వరుసగా పెళ్లి బాజాలు మోగుతున్నాయి . వచ్చే నెల నాగచైతన్య, శోభిత ల పెళ్లి జరుగుతున్న విషయం మనందరికి తెలుసు . తాజాగా అక్కినేని అఖిల్ కూడా తన అన్న బాటలోనే నడుస్తున్నాడు. ఇప్పటివరకు ది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఉన్న అతను త్వరలోనే వైవాహిక బంధంలోకి అడుగుపెట్టనున్నాడు. తాజాగా జైనాబ్ రవడ్జీ అనే అమ్మాయితో అఖిల్ ఎంగేజ్ మెంట్ జరిగింది. హైదరాబాద్‌లోని నాగార్జున ఇంట్లో కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ వేడుక జరిగింది. అక్కినేని అఖిల్ నిశ్చితార్థం విషయాన్నినాగార్జునే స్వయంగా సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించాడు. అఖిల్ కూడా తన సోషల్ మీడియా అకౌంట్ ద్వార తెలిపారు . అది చూసిన అక్కినేని అభిమానులు బ్రదర్స్ ఇద్దరికీ తమ విషెస్ ని తెలుపుతున్నారు .
BREAKING NEWS: ఇదేమీ మర్డర్ కేసు కాదు కదా …ఆర్జీవి