రాజ్‌తరుణ్-లావణ్య వివాదంలో మరో ట్విస్ట్
‘రాజ్‌తరుణ్ ప్రేయసి’ లావణ్య రాజ్‌తరుణ్ తనను మోసం చేశాడంటూ చేస్తున్న ఆరోపణల సంగతి ఎలా ఉన్నా.. రాజ్‌తరుణ్ పేరు మాత్రం నిత్యం వార్తల్లో వైరల్ అవుతూనే ఉంది. దీనికి తోడు లావణ్య ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేయడం, పోలీసులు ఆమె ఇంటికి వెళ్లి రక్షించడంతో ఈ వ్యవహారం మొత్తం సీరియస్ అయ్యింది. ఐతే, రాజ్‌తరుణ్, లావణ్య కేసులో తాజాగా మరో ట్విస్ట్ నెలకొంది.
తనతో రాజీ కోసం రాయబారాలు పంపుతున్నారని తాజాగా లావణ్య కామెంట్స్ చేసింది. సెటిల్‌మెంట్ కోసం రాజ్‌తరుణ్ ఫోన్ చేశారని ఆమె తెలిపింది. కాగా, లావణ్య స్టేట్‌మెంట్‌ను నార్సింగి పోలీసులు రికార్డు చేశారు. విచారణకు హాజరుకావాలని రాజ్‌తరుణ్‌కు పోలీసులు నోటీసులు పంపే ఛాన్స్ ఉంది. మరి రాజ్‌తరుణ్ ఈ ఆరోపణలపై పోలీసులకు ఎలాంటి వివరణ ఇస్తాడో వేచి చూడాలి.
