రేణుకా స్వామి హత్య కేసులో మరో ట్విస్ట్
కన్నడనాట సంచలనం కలిగించిన రేణుకాస్వామి హత్య కేసులో మరో ట్విస్ట్ వెలుగు చూసింది. కన్నడ హీరో దర్శన్‌ను, అతని స్నేహితురాలు పవిత్రగౌడ్‌ను ఇప్పటికే అరెస్టు చేశారు పోలీసులు. అయితే ఇప్పుడు కొత్తగా దర్శన్ స్నేహితుడు, కన్నడ హాస్యనటుడు చిక్కన్న పేరు కూడా వెలుగులోకి వచ్చింది. హత్య జరిగిన రోజు దర్శన్‌తో పాటు రెస్టారెంట్‌లో చిక్కన్న కూడా ఉన్నాడని గుర్తించారు పోలీసులు. ఈ పార్టీలో కొంతసేపటికే దర్శన్ బయటకు వెళ్లిపోయాడు. అయితే ఈ పార్టీలో ఉండడంతో చిక్కన్నను కూడా విచారించాలని భావించి అతనిని విచారణకు రమ్మంటూ నోటీసులు ఇచ్చారు.