ప్రకాష్ రాజ్ మరో ట్వీట్
తిరుమల లడ్డూ వ్యవహారంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నటుడు ప్రకాష్ రాజ్ మధ్య ట్వీట్ వార్ నడుస్తోంది. తాజాగా ప్రకాష్ రాజ్ మరో ట్వీట్ చేశారు. కొత్త భక్తుడికి పంగానామాలెక్కువ.. ఇకనైనా ప్రజల కోసం చెయ్యవలసిన పనులు చూడండని తెలుగులో రాసి పోస్ట్ చేశారు. లడ్డూ వ్యవహారంలో నిన్న సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలతో ప్రకాష్ రాజ్ పవన్ కు చురకలు అంటించారు.