కమల్‌హాసన్‌కు మరో అత్యుత్తమ పురస్కారం
ప్రముఖ విలక్షణ నటుడు కమల్‌హాసన్ తన నటనతో ఇప్పటి వరకు ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులను సొంతం చేసుకున్నారు. అయితే తాజాగా ఆయనకు మరో అత్యుత్తమ పురస్కారం లభించనుంది. కమల్ హాసన్ సినీ రంగంలో గత 6 దశాబ్దాలుగా తన విలక్షణ నటనతో ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నారు. అయితే ఆయన నటుడిగా మాత్రమే కాకుండా దర్శకుడిగా ,నిర్మాతగా,డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా సినీరంగానికి ఎన్నో సేవలందించారు. ఈ సేవలను గుర్తించిన ఐఫా ఆయనకు జీవితకాల సాఫల్య పురస్కారాన్ని ప్రకటించింది. ఈ నెల 27న దుబాయ్ అబుదాబిలో జరిగే ఐఫా వేడుకల్లో ఈ పురస్కారాన్ని ఆయనకు అందించనున్నట్లు పేర్కొంది. ఈ విషయాన్ని ఐఫా నిర్వాహకులు అధికారికంగా వెల్లడించారు. కమల్‌హాసన్ తన సినీ కెరీర్‌లో ఇప్పటివరకు ఎన్నో అత్యత్తమ అవార్డులను దక్కించుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును పొందనుండడంతో ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా వారు సోషల్ మీడియా వేదికగా కమల్ హాసన్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం కమల్ హాసన్ శంకర్ దర్శకత్వంలో భారతీయుడు -2 మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్,రకుల్ ప్రీత్ సింగ్ కీలక పాత్రలు పోషించినట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తైనట్లు తెలుస్తోంది. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.