జమ్ముకాశ్మీర్ లో మరోసారి ఉగ్రదాడి
జమ్ముకాశ్మీర్ లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. పుల్వామా జిల్లాలోని బట్ గుండ్ గ్రామంలో ఓ కూలీపై కాల్పులు జరిపారు. ఘటనలో అతని కుడి చేతికి గాయాలయ్యాయి. బాధితుడిని ఉత్తపప్రదేశ్ కు చెందిన శుభం కుమార్ గా గుర్తించారు. గాయ పడిన అతనిని దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. ప్రాణాపాయం లేదని డాక్టర్లు చెప్పారు. అయితే జమ్ముకాశ్మీర్ లో గత వారం రోజుల్లో ఉగ్రదాడి జరగడం ఇది మూడోసారి.

