ఇస్రో మరో ఘనత..ప్రోబా3 ఉపగ్రహం విజయవంతం
రాకెట్ ప్రయోగంలో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో ఘనత సాధించింది. నేడు విజయవంతంగా పీఎస్‌ఎల్‌వీ సీ 59 ఉపగ్రహాన్ని నింగిలోకి ప్రయోగించింది ఇస్రో. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ప్రోబా 3ని ఇస్రో పీఎస్‌ఎల్‌వీ సీ 59 ద్వారా ప్రయోగించింది. ఇది సూర్యుని ఉపరితలంపై అధ్యయనం చేయనుంది. వీటిలోని రెండు ఉపగ్రహాల బరువు 1100 కేజీలు. సూర్యుని కరోనాలో జరిగే మార్పులను అధ్యయనం చేయడానికి ఉపయోగపడుతుంది. భూమి నుండి 600 కిలోమీటర్ల దూరంలో కక్ష్యలో ప్రవేశిస్తుంది. ఈ ప్రయోగం విజయవంతం కావడంపై ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ హర్షం వ్యక్తం చేశారు.


