నారాయణ విద్యా సంస్థల్లో మరో దారుణం
నారాయణ కళాశాలల్లో వరుస ఆత్మహత్యలు చోటు చేసుకుంటున్నాయి.మొన్నటికి మొన్న అనంతపురం సమీపంలోని నారాయణ కాలేజీలో బిల్డింగ్ పై నుండి దూకి ఇంటర్ విద్యార్థి చరణ్ ఆత్మహత్య చేసుకున్న ఘటన మరువక ముందే ఏపిలో మరో ఆత్మహత్య జరిగింది.విశాఖలోని మధురవాడ పరదేశిపాలెం నారాయణ కళాశాలలో ఇంటర్ చదువుతున్న చంద్రవంశీ అనే విద్యార్ధి…కళాశాల భవనం పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.దీంతో కళాశాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.హాస్టల్ విద్యార్ధులు ఎవరూ బయటకు వెళ్లకుండా గేట్లకు తాళాలు వేశారు.విషయం తెలుసుకున్న విద్యార్ధి సంఘాలు కళాశాల ప్రాంతానికి చేరుకుని ఆందోళనకు ఉపక్రమించాయి.