స్పెషల్ సాంగ్ కి రెడీ అంటున్న మరో స్టార్ హీరోయిన్…..!
ఈ మధ్య ఎక్కువగా లేడీ ఓరియంటెడ్ సినిమాలే చేస్తున్నారు సీనియర్ హీరోయిన్ నయనతార. తాజాగా నయనతార మీద వస్తున్న ఒక వార్త ఇప్పుడు వైరల్ గా మారింది. ఇన్నాళ్లు కమర్షియల్ సినిమాలు చేస్తున్నా, ఇన్నేళ్ల తన కెరీర్‌లో ఇంతవరకు స్పెషల్ సాంగ్‌లో కనిపించలేదు నయనతార. ఆమె త్వరలో స్పెషల్ సాంగ్ తో ప్రేక్షకుల ముందుకి రావడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలియజేశారు. ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న హారర్ కామెడీ మూవీ ‘రాజాసాబ్’. మాళవిక మోహన్, నిధి అగర్వాల్ హీరోయిన్‌లుగా నటిస్తున్న ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ కూడా ఉంటుందన్న టాక్ వినిపిస్తోంది. ఆ పాటలో హీరోయిన్‌గా నయనతారను తీసుకోవాలని భావిస్తోంది ‘రాజాసాబ్’ టీమ్. నయన్ కూడా ప్రభాస్ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసేందుకు ఇంట్రస్ట్‌గా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి . ఈ న్యూస్ నిజమైతే ఇంక ఫాన్స్ కు పండగే అని చెప్పవచ్చు.