వైసీపీకి మరో షాక్.. ఎమ్మెల్సీ రాజీనామా..
శాసనమండలిలో వైసీపీకి మరో షాక్ తగిలింది. వైసీపీకి ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ రాజీనామా చేశారు. ఆయన రాజీనామా లేఖను స్పీకర్ కు పంపించారు. ఇప్పటికే పోతుల సునీత, కల్యాణ చక్రవర్తి.. కర్రి పద్మశ్రీ, జయమంగళ వెంకటరమణ రాజీనామా చేశారు. రాజశేఖర్ రాజీనామాతో వైసీపీ అసంతృప్తులు ఐదుకు చేరారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో వైసీపీలో ఈయన కీలక నేతగా ఉన్నారు. రాజశేఖర్ పార్టీని వీడి వెళతారంటూ కొంతకాలంగా ఊహాగానాలు వినిపించాయి. కొద్దిరోజుల కిందట ఉమ్మడి గుంటూరు జిల్లా వైసీపీ నేతలతో జగన్ సమావేశం నిర్వహించారు. ఆ సమావేశానికి మర్రి రాజశేఖర్ డుమ్మా కొట్టారు. దీంతో ఆయన రాజీనామా చేస్తారని వార్తలకు బలం చేకూరింది.