వైసీపీకి మరో షాక్..
మాజీ మంత్రి అవంతీ శ్రీనివాస్ వైసీపీ పార్టీకి షాక్ ఇచ్చారు. వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. జగన్ హయాంలో అవంతి పర్యాటక మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం ఉన్న వైసీపీ భీమిలి నియోజక వర్గ్ ఇన్‌ఛార్జ్ పదవికి, పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. ఈ లేఖను పార్టీ అధినేత జగన్‌కు, ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డికి పంపినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఆయన జగన్‌పై పలు విమర్శలు చేశారు. జగన్ ప్రజల తీర్పును గౌరవించాలని, కొత్త ప్రభుత్వానికి కాస్త సమయం కూడా ఇవ్వకుండా ధర్నాలు చేస్తానంటున్నారని పేర్కొన్నారు. వైసీపీ పార్టీ ప్రజాస్వామ్య బద్దంగా లేదంటూ విమర్శించారు. తాడేపల్లిలో కూర్చుని జగన్ ఆదేశాలిస్తుంటారని, క్షేత్రస్థాయిలో కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారని వ్యాఖ్యానించారు.