Home Page SliderNational

రాహుల్ గాంధీకి మరో షాక్

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మోదీ ఇంటిపేరు వ్యవహారంలో పరువు నష్టం దావా ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే ఆయన తన ఎంపీ పదవిని కోల్పోయారు. అయితే ఈ కేసులో రాహుల్ గాంధీకి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. రాహుల్‌కు సూరత్ కోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్షను గుజరాత్ హైకోర్టు సింగిల్ బెంచ్ సమర్థించింది. కాగా రాహుల్ గాంధీకి ఊరటనిచ్చేందుకు తగిన అవకాశాలు లేవని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. అంతేకాకుండా రెండేళ్ల జైలు శిక్షపై స్టేకు నిరాకరించారు. ఈ క్రమంలో రాహుల్ GHC డివిజన్‌కు వెళ్తారో లేదో వేచి చూడాలి.