Home Page SliderTelangana

మై హోమ్ గ్రూప్ సంస్థకు మరో ప్రతిష్టాత్మక అవార్డు

నిర్మాణ రంగంలో మైహోమ్ గ్రూప్ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. మైహోమ్ గ్రూపు సంస్థకు మరో ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. తెలంగాణ బెస్ట్ ఎంప్లాయర్ బ్రాండ్ అవార్డును సొంతం చేసుకుంది. బుధవారం హైదరాబాద్ లోని బేగంపేటలో తెలంగాణ లీడర్షిప్-2024 అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. వరల్డ్ మ్యానుఫాక్చరింగ్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈ ప్రతిష్టాత్మక అవార్డు కార్యక్రమం జరిగింది. అయితే.. ఇప్పటికే మైహోమ్ గ్రూప్ సంస్థకు పలు అవార్డులు వచ్చాయి. గతంలో ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ప్రకటించిన ఎక్సలెన్సీ అవార్డు దక్కింది.