Home Page SliderInternationalNewsSports

బుమ్రాకు మరో అరుదైన అవార్డ్..

టీమిండియా దిగ్గజ ఆటగాడు జస్‌ప్రీత్ బుమ్రాకు మరో అరుదైన అవార్డ్ దక్కింది. 2024వ సంవత్సరంలో బుమ్రా మూడు ఫార్మాట్లలో విశేషంగా రాణించారు. 21 మ్యాచ్‌లలో 13 సగటు వికెట్లతో 86 వికెట్లు తీసి లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచారు. గతేడాది టెస్టులలో కూడా విశేషంగా రాణించారు. దీనితో 2024కు ‘విజ్డెన్ మెన్స్ లీడింగ్ క్రికెటర్ ఆఫ్ ద వరల్డ్’ అవార్డుకు ఎంపికయ్యారు. ఇప్పటికే బుమ్రా ‘ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’, ‘ఐసీసీ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’,’ బీసీసీఐ మెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డులు గెలుచుకున్నారు. తాజాగా ఈ అవార్డు కూడా గెలుచుకోవడంతో కోహ్లి, సెహ్వాగ్, సచిన్ వంటి దిగ్గజాల సరసన నిలిచారు. దీనితో ఇప్పటి వరకూ 4 గురు భారత క్రికెటర్లు ఈ అవార్డు దక్కించుకున్నట్లయ్యింది. కోహ్లికి 3సార్లు, సెహ్వాగ్ 2, సచిన్‌కు ఒకసారి ఈ విజ్డెన్  మెన్స్ అవార్డు దక్కింది.