Home Page SliderInternational

మెగాస్టార్‌ చిరంజీవి ఖాతాలో మరో ప్రతిష్టాత్మక అవార్డు..

మెగాస్టార్ చిరంజీవి తెలుగు సినీ పరిశ్రమలో ఏ హీరో సంపాదించని గొప్ప పేరు ప్రఖ్యాతులు, అవార్డులు సంపాదించారు. ఇటీవలే ఆయన డ్యాన్స్ మూమెంట్ల పరంగా ‘గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు’ను కూడా సాధించిన సంగతి తెలిసిందే. ఆయనను మరో ప్రతిష్టాత్మక అవార్డు వరించింది. ‘ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ 2024 (IIFA)’  అవార్డుల ప్రధానోత్సవం అబుదాబిలో జరుగుతోంది. కాగా చిరంజీవికి ఈ అవార్డు పంక్షన్‌లో “ఔట్ స్టాండింగ్ అచీవ్మెంట్ ఇండియన్” సినిమా అవార్డును బహుకరించారు. దీనితో చిరంజీవిని హీరో బాలకృష్ణ ఆలింగనం చేసుకుని అభినందించారు. హీరో వెంకటేష్ చిరంజీవిని అభినందిస్తూ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ వీడియోలు నెటిజన్లను ఎంతో ఆకర్షిస్తున్నాయి. ఇప్పటికే ఆయనకు భారత ప్రభుత్వం పద్మభూషణ్, పద్మవిభూషణ్ బిరుదులనిచ్చి సత్కరించింది. దీనితో తెలుగు సినిమా చరిత్రలో ఇన్ని అవార్డులు, పురస్కారాలు పొందిన నటుడిగా చిరంజీవి గొప్ప పేరు గడించారు.