Andhra PradeshHome Page Slider

ఏపీ హైకోర్టులో ఆర్జీవీ మరో పిటిషన్

చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేశ్ మార్ఫింగ్ ఫోటోలను షేర్ చేసిన కేసులో పోలీసు విచారణకు హాజరు కాకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన ప్రముఖ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఏపీ హైకోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు. ఎక్స్ లో తాను పెట్టిన పోస్టుపై అనేక కేసులు నమోదు చేస్తున్నారని… ఒక విషయంపై ఇన్ని కేసులు పెట్టడం సమంజసం కాదని పిటిషన్ లో ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కేసులు నమోదు చేస్తుండటం చట్ట విరుద్దమని అన్నారు. ఇకపై కేసులు పెట్టకుండా ఆదేశాలు జారీ చేయాలని, ఇప్పటి వరకు నమోదైన కేసులను క్వాష్ చేయాలని హైకోర్టును కోరారు.