టాలీవుడ్ ఇండస్ట్రీలోకి మరో ఎన్టీఆర్..!
నందమూరి తారక రామారావు ముని మనవడు జానకీరామ్ తనయుడు తారక రామారావు హీరోగా మూవీ లాంచ్ అయింది. వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో తారక రామారావు హీరోగా సినిమాను తెరకెక్కించనున్నారు. ‘న్యూ టాలెంట్ రోర్స్’ పతాకంపై ఆయన సతీమణి గీత ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నేడు ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా లోకేశ్వరి, పురందేశ్వరి, భువనేశ్వరిలతో పాటు ఎన్టీఆర్ కుటుంబసభ్యులు హాజరయ్యారు. నారా భువనేశ్వరి క్లాప్ కొట్టి నటీనటులను అభినందించారు.