Home Page SliderNational

కన్నప్ప నుంచి మరో కొత్త పోస్టర్

మంచు విష్ణు నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం కన్నప్ప. ఇందులో ప్రభాస్, మోహన్ బాబు, మోహన్ లాల్, మధుబాల, శరత్ కుమార్, శివరాజ్ కుమార్, మొదలయిన భారీ తారాగణం నటిస్తున్నారు. అందులో బాలీవుడ్ హీరో అయిన అక్షయ్ కుమార్ శివుని పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే అక్షయ్ కుమార్ పుట్టిన రోజు సందర్భంగా కన్నప్ప మూవీ టీం ఆయనకు సంబంధించిన పోస్టర్ ఒకటి X లో పోస్ట్ చేసారు. “హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అక్షయ్ కుమార్. ఈ చిత్రంలో మీరు శివుని పాత్ర పోషించడం మీ చంచలమైన అంకితభావానికి నిదర్శనం” అంటూ ట్వీట్ చేసింది.

కన్నప్ప మూవీ నుంచి ఇప్పటికే వివిధ పాత్రలకు సంబంధించిన ఫస్ట్‌లుక్స్‌ విడుదలవగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ, స్టీఫెన్ దేవసి మ్యూజిక్, బ్యాగ్రౌండ్ స్కోర్ సమకూరుస్తున్నారు.