వైసీపీకి మరో ఎమ్మెల్సీ రాజీనామా..
ఏపీలో వైసీపీ పార్టీకి మరో ఎమ్మెల్సీ షాక్ ఇచ్చారు. తాజాగా కైకలూరుకు చెందిన ఎమ్మెల్సీ జయమంగళ వెంకట రమణ వైసీపీ పార్టీకి రాజీనామా సమర్పించారు. తన ఎమ్మెల్సీ పదవికి, పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను శాసన మండలి ఛైర్మన్ మోసేనురాజుకు సమర్పించారు. గతంలో టీడీపీలో ఉన్న వెంకటరమణ, అసెంబ్లీ ఎన్నికల ముందే వైసీపీలో చేరారు. ఎమ్మెల్సీ ఎన్నికలో విజయం సాధించారు. అయితే అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ పరాజయంతో ఆయన పార్టీలో క్రియాశీలకంగా లేరని సమాచారం. తాజాగా రాజీనామా చేయడంతో ఏ పార్టీలో చేరతారోననే ఆసక్తి నెలకొంది.