పారాలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం
పారిస్‌లో జరుగుతున్న పారాలింపిక్స్‌లో భారత్ మరో పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది. పురుషుల డిస్క్ త్రో ఎఫ్ 56లో యోగేశ్ కతునియా 42.22 మీటర్ల దూరం విసిరి రజతపతకం సాధించారు. ఈ పోటీలో బ్రెజిల్‌కు చెందిన క్లాడినీ బాటిస్టా స్వర్ణం అందుకున్నారు. గత టోక్యో ఒలింపిక్స్‌లో కూడా యోగేశ్ రజతం సాధించారు. దీనితో భారత్ ఇప్పటి వరకూ 8 పతకాలు సాధించింది.