ఆసిఫ్‌నగర్ పరిధిలో మరో లిఫ్టు ప్రమాదం.
గత కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ లోని శాంతి నగర్ లో లిఫ్టు ప్రమాదంలో బాలుడు చనిపోయిన విషయం మరువకముందే మరోసారి లిప్ట్ ప్రమాదం చోటు చేసుకుంది. అసిఫ్ నగర్ లోని ఓ అపార్ట్‌మెంట్ లో ఐదో అంతస్తు నుంచి ఒక్కసారిగా లిఫ్టు పడింది. లిఫ్టు పడిన సమయంలో ఆరుగురు ఉన్నారు. వారిలో ముగ్గురికి తీవ్రంగా గాయాలయ్యాయి. వెంటనే వారిని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న నాంపల్లి ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్ ఆస్పత్రిలో బాధితులను పరామర్శించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.