Home Page SliderNational

బఠిండాలో కాల్చుకుని మృతిచెందిన మరొక జవాన్

పంజాబ్‌లోని మిలిటరీ స్టేషన్ బఠిండాలో మరొక జవాన్ నేడు స్వయంగా కాల్చుకుని మృతి చెందారు. నిన్నఉదయం అదే స్టేషన్‌లో  జరిగిన కాల్పుల్లో నలుగురు జవాన్లు మృతి మరువక ముందే ఈ సంఘటన జరగడం దురదృష్టకరం. ఈ సంఘటనకు, నిన్న జరిగిన ఆగంతకుల కాల్పుల సంఘటనకు సంబంధం లేదని ఆర్మీ అధికారులు పేర్కొంటున్నారు. ఇతనిని రాజ్ శంకర్‌గా గుర్తించారు. ఇది ఆత్మహత్యగా భావిస్తున్నారు. డ్యూటీలో ఉండగా అతని రైఫిల్‌తో అతనే కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆధారాలు సేకరించారు. అతను లీవు నుండి 11 వ తేదీనే తిరిగి వచ్చి డ్యూటీలో జాయిన్ అయ్యాడని, సెంట్రీగా పని చేస్తున్నాడని తెలిపారు. దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన బఠిండా ఆర్మీ స్టేషన్ల్‌లోని కాల్పుల మిస్టరీని ఇంకా చేధించకముందే అదే స్థలంలో ఈ సంఘటన జరగడంతో ఈ ఘటనలకు సంబంధం ఉందేమోనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.