Home Page SlidermoviesTelanganatelangana,

మెగా ఫ్యామిలీలో మరో శుభవార్త..

టాలీవుడ్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠీల జంట వారి కుటుంబంలో మరో ఆనందాన్ని తీసుకురాబోతున్నారు. వారు తల్లిదండ్రులు కాబోతున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 2023 నవంబర్‌లో వీరిద్దరూ ఇటలీ వేదికగా దంపతులయిన సంగతి తెలిసిందే. మిస్టర్, అంతరిక్షం చిత్రాలలో కలిసి నటించిన వీరిద్దరూ ప్రేమలో పడి, అనంతరం వివాహం చేసుకున్నారు. జీవితంలో అందమైన పాత్ర పోషించబోతున్నామంటూ, కమింగ్ సూన్ అని వరుణ్ తేజ్ క్యాప్షన్ పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ కావడంతో పలువురు సినీ ప్రముఖులు వీరికి శుభాకాంక్షలు చెప్తున్నారు. సమంత, అల్లు స్నేహ, రకుల్ ప్రీత్ సింగ్ వంటి సెలబ్రెటీలు కంగ్రాట్యులేషన్స్ అంటూ రిప్లైలు పెడుతున్నారు.