యూపీలో మరో గ్యాంగ్‌స్టర్ ఎన్‌కౌంటర్, ఈసారి మీరట్‌లో
యూపీ పోలీసు స్పెషల్ టాస్క్ ఫోర్స్ బృందం, ఇవాళ ఎన్‌కౌంటర్‌లో మరో గ్యాంగ్‌స్టర్‌ను కాల్చి చంపింది. ఢిల్లీ-జాతీయ రాజధాని ప్రాంతంలోని నోయిడా, ఘజియాబాద్ ఏరియాలో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోన్న అనిల్ దుజానా, మీరట్‌లో యూపీ పోలీసుల ప్రత్యేక టాస్క్ ఫోర్స్ (ఎస్‌టిఎఫ్) ఎన్‌కౌంటర్‌లో మరణించాడు. అనిల్ దుజానా 60కి పైగా క్రిమినల్ కేసుల్లో దోషిగా ఉన్నాడు. హత్య కేసులో బెయిల్ పొంది వారం రోజుల క్రితమే జైలు నుంచి విడుదలయ్యాడు.
ఆ వెంటనే, తనపై నమోదైన హత్య కేసులో కీలక సాక్షులలో ఒకరిని బెదిరించడం ప్రారంభించాడు. సాక్షిని చంపాలని దుజానా నిర్ణయించుకున్నారని సమాచారం మేరకు ఎస్టీఎఫ్ రంగంలోకి దిగింది. ఆపరేషన్ సమయంలో, దుజానా, అతని గ్యాంగ్ పోలీసులపై దాడికి తెగబట్టారు. ఇరుపక్షాల మధ్య కాల్పుల్లో గ్యాంగ్‌స్టర్ ప్రాణాలు కోల్పోయాడు. మీరట్‌లోని ఒక గ్రామంలో, ఎత్తైన పొదలతో చుట్టుముట్టబడిన, చదును చేయని రహదారిపై ఈ ఎన్‌కౌంటర్ జరిగింది.