Breaking NewsHome Page SliderTelangana

TSPSC ప్రశ్నాపత్రాల లీకేజీతో మరో పరీక్ష వాయిదా

తెలంగాణాలో TSPSC ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం రాష్ట్రంలో తీవ్రదుమారం సృష్టించిన విషయం తెలిసిందే.  అయితే ఈ పేపర్ లీకేజీ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతూనేవుంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్వహించిన దాదాపు 5 రకాల పరీక్షలను రద్దు చేసింది. కాగా ఇప్పుడు మరో పరీక్షను వాయిదా వేయనున్నట్లు తెలుస్తోంది. ఉద్యానవనశాఖలో 22 హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టులకు ఏప్రిల్ 4న రాత పరీక్ష జరగాల్సివుంది. కాగా TSPSC ఇప్పటివరకు హాల్‌టికెట్లను విడుదల చేయలేదు. అయితే ఈ పరీక్ష నిర్వహించాలా లేదా అన్న అంశంపై TSPSC ఈ రోజు కీలక నిర్ణయం తీసుకోనుంది. తాజా పరిణామాల నేపథ్యంలో పరీక్షను వాయిదా వేసేందుకే కమీషన్ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. కాగా TSPSC గత డిసెంబర్ 22న హార్టికల్చర్ ఆఫీసర్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.