Breaking NewsInternationalNationalNewsTrending Today

వైల్డ్ కార్డ్ ఎంట్రీతో మరో ముద్దుగుమ్మ…..!

రెండో వారంలో అడుగు పెట్టిన బిగ్ బాస్ సీన్ 8, నిన్న నామినేషన్స్ పూర్తయ్యింది. ఈ వారం ఇంటి నుంచి బయటికి వెళ్లడానికి మణికంఠ, పృథ్వీ , ఆదిత్య, నిఖిల్, సీత, శేఖర్ బాషా, నైనిక, విష్ణుప్రియ నామినేట్ అయ్యారు. వారిలో పృథ్వీ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయ్. బెబక్క హౌస్ నుంచి వెళ్ళిపోయాక ఇప్పుడు హౌస్ లో 13 మంది మిగిలారు. ఈ వారం ఒకరు ఎలిమినేట్ ఐతే ఇంకా 12 మంది అవుతారు. కాబట్టి ఒక వైల్డ్ కార్డు ఎంట్రీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఆమె మరెవరో కాదు. సీరియల్స్ లో నటిస్తూ సినిమా హీరోయిన్స్ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్న బ్యూటీ జ్యోతి రాయ్. ఈ ముద్దుగుమ్మ గుప్పేడంత మనసు సీరియల్ జగతి పాత్ర ద్వారా పాపులర్ అయ్యింది. ఈ సీరియల్ లో హీరో తల్లి పాత్రలో యాక్ట్ చేసింది. ఈ హాట్ బ్యూటీ హౌస్ లో వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.