Home Page SliderNational

బెంగాల్‌లో బాలికపై మరో దారుణ ఘటన

పశ్చిమ బెంగాల్ ఇప్పటికే ఆర్జీకర్ ఆస్పత్రి ఘటనతో అట్టుకుతోంది. ఈ పరిస్థితుల్లో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. ముక్కుపచ్చలారని 11 ఏళ్ల బాలికపై అత్యాచార ఘటన జరిగింది. సౌత్ 24 పరగణాస్ జిల్లాలో శుక్రవారం కోచింగ్ క్లాసుకు వెళ్లింది బాలిక. రాత్రయినా ఇంటికి రాకపోవడంతో ఆమె కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చివరికి ఆమె శనివారం తెల్లవారుజామున మూడున్నరగంటల సమయంలో ఓ పొలంలో ఒంటినిండా గాయాలతో ఆమె మృతదేహం దొరికింది. దీనితో స్థానికులు ఆగ్రహం పట్టలేక పోలీస్ స్టేషన్‌పై దాడి చేసి, నిప్పు పెట్టారు. దీనితో పరిస్థితి విషమించింది. ఇప్పటికే ఈ దారుణం చేశాడని అనుమానంతో 19 ఏళ్ల యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. బెంగాల్ ప్రభుత్వం చేతకానితనం వల్లే ఇలాంటి చర్యలు జరుగుతున్నాయని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవడం లేదని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సుకాంత మజుందార్ మండిపడ్డారు. ముఖ్యమంత్రి మమత రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు.