బోరుబావిలో పడ్డ మరో బాలుడు
మన దేశంలో గడచిన కొన్ని సంవత్సరాల్లో ఎంతోమంది చిన్నారులు ప్రమాదవశాత్తు బోరుబావిలో పడి ప్రాణాలు విడిచారు. కాగా ఇటువంటి ప్రమాదాలను నియత్రించడానికి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపడుతున్నప్పటికీ వీటిని మాత్రం పూర్తిగా నియంత్రించలేకపోతున్నారు. దీంతో మన దేశంలో ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నాయి. తాజాగా మరో 9 ఏళ్ల బాలుడు బోరు బావిలో పడ్డాడు. ఈ సంఘటన రాజస్థాన్ జైపూర్‌లోని భోజ్‌పుర గ్రామంలో చోటు చేసుకుంది. అయితే దీని గురించి సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టాయి. ప్రస్తుతం బాలుడికి పైపు ద్వారా ఆక్సిజన్ అందిస్తున్నారు. బాలుడిని త్వరగా బయటకు తీసుకు వచ్చేందుకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

