పాక్‌లో మరోసారి బాంబు పేలుడు ..7గురు మృతి
పాకిస్థాన్‌లో బాంబు పేలుళ్లు కలకలం సృష్టిస్తున్నాయి. ఐదు రోజుల ముందే ట్రైన్‌లో బాంబు పేలితే, నిన్న గురువారం కారులో బాంబు పేలడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. నార్త్ పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ అనే ప్రాంతంలో ఈ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు సహా 7 మంది మృతి చెందారు. మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. రసూల్ ఖాన్ అనే తాలిబన్ ఉగ్రవాది తన ఇంటికి సమీపంలో కారులో బాంబును అమరుస్తుండగా అది పేలిందని సమాచారం. మృతదేహాలను తాలిబన్లే తరలించారని పోలీసులు పేర్కొన్నారు.