మరో బాలీవుడ్ జంట విడాకులు
ఇటీవల సినీ ఇండస్ట్రీలో విడాకులు సాధారణం అయిపోయాయి. పెళ్లయి, దశాబ్దాలు గడిచిన జంటలు కూడా విడాకులకు సిద్ధమయిపోతున్నారు. తాజాగా ప్రముఖ బాలీవుడ్ నటుడు గోవిందా తన భార్య సునీతా అహుజాకు విడాకులు ఇవ్వబోతున్నట్లు సమాచారం. ఒకప్పుడు టాప్ బాలీవుడ్ హీరోగా ఉన్న గోవిందా ఇటీవల సినిమాలలో నటించడం లేదు. అతని భార్య సునీతతో తన 38 ఏళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలకబోతున్నారట. గత కొన్నాళ్లుగా వీరిద్దరూ వేర్వేరుగానే ఉంటున్నారు. గోవిందా ఒక మరాఠీ నటితో రిలేషన్‌లో ఉన్నారని, అందుకే అతని భార్య తన కూతురు, కొడుకుతో కలిసి ఉంటున్నారని సమాచారం.

