Andhra PradeshHome Page Slider

ఏపీలో బాలికపై మరో దారుణం

ఏపీలో మరో దారుణ ఘటన వెలుగులోకొచ్చింది. కాకినాడ జిల్లా పిఠాపురంలో 16 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగింది. బాలిక నడుస్తూ వెళుతుండగా, ఆటోలో వెళుతున్న ఒక వ్యక్తి, ఒక మహిళ ఆమెను ఒక కాగితం చూపించి, అడ్రస్ అడిగారు. అనంతరం మత్తుమందు స్ప్రే చేసి, ఆమెను పట్టణ శివారుకు తీసుకెళ్లి మద్యం తాగించారు. తర్వాత ఆ వ్యక్తి అత్యాచారానికి పాల్పడినట్లు తెలిసింది. అపస్మారక స్థితిలో ఉన్న బాలికను ఆటో ఎక్కిస్తుండగా, చెత్త ఏరుకునే మహిళ గుర్తించి, అనుమానంతో ఫిర్యాదు చేయగా, విషయం వెలుగులోకి వచ్చింది.