ట్రంప్ పై మరోసారి హత్యాయత్నం
అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ పై మరోసారి హత్య చేసేందుకు కుట్ర జరిగింది. కాలిఫోర్నియాలోని కోచెల్లాలో ట్రంప్ నిర్వహిస్తున్న ర్యాలీలో ఓ వ్యక్తి రెండు గన్లతో సంచరించాడు. నిందితుడిని సీక్రెట్ సర్వీసెస్ అదుపులోకి తీసుకుంది. లాస్వెగాన్ కు చెందిన వేం మిల్లర్ నకిలీ ప్రెస్ కార్డు, ఎంట్రీ పాస్ తో ర్యాలీ స్టేజీకి సమీపంలో లోడ్ చేసిన షాట్ గన్, హ్యాండ్‌గన్, హై కెపాసిటీ గల మ్యాగజైన్ తో తిరుగుతుండగా, అతడ్ని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. అయితే.. డొనాల్డ్ ట్రంప్ పై హత్యాయత్నం జరగడం ఇది మూడోసారి.