Breaking NewsHome Page SliderTelanganatelangana,

తెలంగాణలో మరో ఎయిర్‌పోర్ట్..

తెలంగాణ రాష్ట్రానికి మరో ఎయిర్ పోర్ట్ శాంక్షన్ అయ్యింది. వరంగల్‌లోని మామూనూరు ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సమాచారంపై మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రప్రభుత్వం రూ.205 కోట్లను ఈ ఎయిర్ పోర్టు కోసం విడుదల చేసింది. దీనితో భూసేకరణ చేస్తున్నారు. ఇప్పటికే 696 ఎకరాల భూసేకరణ పూర్తవగా, మరో 253 ఎకరాలు సేకరించాల్సి ఉంది. కేంద్ర ఉత్తర్వులతో నిర్మాణ పనులు మొదలుకాబోతున్నాయి.