మరో ఆప్ లీడర్ అరెస్ట్
ఆమ్ ఆద్మీ పార్టీకి వరుస కష్టాలు వస్తున్నాయి. సోమవారం ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లాను ఈడీ అరెస్టు చేసింది. వక్ఫ్ బోర్డులో అక్రమాలు, అక్రమాస్తుల కేసులో ఆయనను అరెస్టు చేశారు. అయితే ఇదే పార్టీకి సంబంధించిన కమ్యూనికేషన్స్ విభాగం మాజీ ఇన్‌ఛార్జ్ విజయ్ నాయర్ ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో 23 నెలల తర్వాత జైలు నుండి విడుదల కావడం విశేషం. ఇలా ఒకరు విడుదలైతే, మరొకరు అరెస్టు అయ్యారు.