ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై అన్నా హజారే సంచలన వ్యాఖ్యలు
దేశ రాజధానిలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సామాజిక కార్యకర్త అన్నా హజారే స్పందించారు. అధికార దాహంతోనే ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఓడిపోయారన్నారు. లిక్కర్ స్కామ్‌తో కేజ్రీవాల్ అప్రతిష్ఠపాలయ్యారన్నారని అన్నా హజారే కీలక వ్యాఖ్యలు చేశారు. కేవలం మద్యంపైనే దృష్టి సారించడంతో కేజ్రీవాల్‌ను ప్రజలు ఓడించారన్నారు. అన్నా హజారే విలేకరులతో మాట్లాడుతూ.. “అభ్యర్థి ప్రవర్తన, ఆలోచనలు స్వచ్ఛంగా ఉండాలని, జీవితం నిందలు లేకుండా ఉండాలని, త్యాగం చేయాలని… ఈ లక్షణాలే ఓటర్లకు ఆయనపై విశ్వాసం కలిగిస్తాయని నేను ఎప్పుడూ చెబుతుంటాను. నేను ఈ విషయాన్ని అరవింద్ కేజ్రీవాల్‌కి చెప్పాను, కానీ అతను పట్టించుకోలేదు, చివరకు అతను మద్యంపై దృష్టి పెట్టాడు. అరవింద్ కేజ్రీవాల్ డబ్బు బలంతో ఊగిపోయాడని అన్నా హజారే సంచలన వ్యాఖ్యలు చేశారు.

