హోంమంత్రిగా వంగలపూడి అనిత బాధ్యతల స్వీకరణ
ఏపీ హోంశాఖ మంత్రిగా వంగలపూడి అనిత నియమితులైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె ఈ రోజు హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.కాగా ఏపీ సచియాలయంలోని 2వ బ్లాక్‌లోని తన ఛాంబర్‌లో హోంమంత్రిగా అనిత బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా వేదపండితులు హోంమంత్రి అనితకు ఆశీర్వచనాలు అందించారు.అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ముందుగా ఏపీ ప్రజలకు, తనను ఎమ్మెల్యేగా గెలిపించిన పాయకరావుపేట ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు.తనను నమ్మి హోంమంత్రి పదవి ఇచ్చిన ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఐటీ శాఖమంత్రి నారా లోకేష్‌తోపాటు ఎన్డీయే నేతలందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఏపీలో ప్రస్తుతం విపరీతంగా పెరిగిపోయిన గంజాయి,డ్రగ్స్ వాడకం,సరఫరాలను త్వరలోనే అరికడతామన్నారు. కాగా పోలీసుశాఖలో ఉన్న వారంతా టీడీపీ కోసం,మా కోసం,ఎన్డీయే కోసం కాకుండా ప్రజల రక్షణ కోసం పనిచేయాలని హోంమంత్రి అనిత పోలీసుశాఖకు సూచించారు.

