ఏపీకి కాబోయే సీఎం పవన్ కళ్యాణ్
కౌలు రైతులకు భరోసా, జనవాణి పేరిట ప్రజా సమస్యలు పరిష్కారం .. లాంటి కార్యక్రమాలతో ప్రజల మధ్య ఉంటున్నారు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్. రాష్ట్ర రాజకీయాల్లో భవిష్యత్ లో జనసేన పోషించే పాత్రను స్పష్టం గా చెప్పకనే చెబుతున్నారు పవన్ కళ్యాణ్. ఐతే వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తారా ? లేదా ప్రతిపక్ష లన్నీ కలిసి పోటీ చేస్తాయా? అన్నదానిపై క్లారిటీ ఇవ్వకుండా … అధికార పార్టీకి ఒక వైపు తెలుగుదేశం పార్టీ మరోవైపు సందిగ్ధం లో ఉంచి ..జనసేనాని రాజాకీయ వ్యూహాన్ని అమలు పరుస్తున్నారు. అధికార పార్టీ నేతలు… జనసేన తమకు పోటీ కాదంటూ ఆ పార్టీపై మంత్రులు, ఎమ్మెల్యేలు తీవ్రంగా విరుచుకుపడుతున్నారు.. అంటే జనసేన ప్రభావం ఏమిటో అర్థం అవుతోంది.. మరోవైపు తెలుగుదేశం జనసేన తనకే మద్దతు ఇస్తోందన్న భ్రమలో ఉంది. దీంతో జనసేనను విమర్శించే సాహసం చేయలేక పోతుంది…

పవన్ కల్యాణ్ ప్రకటనలు చూస్తూ ఉంటె ..జనసేన ఒంటరిగా ఎన్నికల కు వెళ్లే అవకాశాలే మెండుగా కనబడుతున్నాయి.. ఎందుకంటే 2024 లో ఎన్నికల్లో అటు వైసీపీ ..ఇటు టీడీపీ కి కీలకమైన ఎన్నికలు అవుతాయి …వైసీపీ కన్నా టీడీపీకి మాత్రం చావో రేవో ఆనేటట్లు ఉంటాయి ఆ ఎన్నికలు. ఎందుకంటే ..టీడీపీ ఓడితే ఇక టీడీపీ క్యాడర్ ను మింగేయడానికి ఇటు ఒక ప్రక్క జనసేన మరోపక్క బీజేపీ పార్టీ సిద్ధంగా ఉంటాయి ..అలాంటప్పుడు టీడీపీకి 2024 ఎన్నికలు కీలకమైనవి అని చెప్పవచ్చు . ఇక జనసేన తెలంగాణ లో బీజేపీ అనుసరిస్తున్న రాజకీయ ఫార్ములానే ప్రయోగించబోతుంది అనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్రము ఏర్పడినప్పుడు కాంగ్రెస్ .. టీఆర్ఎస్ బలమైన పార్టీలుగా ఉండేవి ..కానీ కేసీఆర్ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ నాయకులు అందరూ ఆ పార్టీలోకి వలస వెళ్లి కాంగ్రెస్ బలహీన పడి ప్రతిపక్షమే లేని స్థితికి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు చేరాయి. కానీ కాంగ్రెస్ లో ఇమడలేక .. టీఆర్ఎస్ లోకి పోలేక మొత్తం క్యాడర్ బీజేపీ వైపు చూడటం ప్రారంభించింది. ఆ విధంగా బీజేపీ బలమైన శక్తి గా అవతరించింది.

2024 ఎన్నికల్లో తెలుగుదేశం అధికారంలోకి రావడం అనేది అంత ఆషామాషీ విషయం కాదు ..అలాంటప్పుడు జనసేన టీడీపీ కి మద్దతు ఇవ్వడం వల్ల జనసేనకు వచ్చే రాజకీయ లబ్ది ఏది ఉండదు …కానీ జనసేన ఒంటరిగా పోటీ చేయడం వల్ల కొన్ని స్థానాలు కచ్చితంగా జనసేన గెలిచి ఒక బలమైన రాజకీయ శక్తిగా అవతరించే అవకాశం మెండుగా ఉంది ..అలాంటి అవకాశాన్ని ఏ రాజాకీయ పార్టీ కూడా వదులుకొదనిపిస్తుంది. ఇక పోతే 2024 ఎన్నికల్లో టీడీపీ జనసేన కు మద్దతు తెలిపి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అభ్యర్థి గా ప్రకటిస్తే ..అప్పుడు బీజేపీ కూడా కచ్చితంగా మద్దతు తెలిపే గత్యంతరం ఏర్పడుతుంది.. జనసేన అధినేత టీడీపీ బీజేపీ జనసేన ఉమ్మడి ముఖ్యమంత్రి అభ్యర్థి గా రంగంలో దిగితే అప్పుడు ysrcp కి ఎన్నికలు అంతా ఆషామాషీ విషయం కాదు . బీజేపీ కేంద్ర నాయకత్వం అంత రాష్ర్ట రాజకీయలు మీద దృష్టి సారించే అవకాశం ఉంది ..అంతేగాని అందరూ కలిసి చంద్రబాబు ను ముఖ్యమంత్రి ని చేసే అవకాశం మాత్రం లేదు …

కడప జిల్లా సిద్ధవటంలో జరిగిన సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ చాలా స్పష్టంగా చెప్పారు తాను ముఖ్యమంత్రి అయితే రాష్ట్రానికి స్వర్ణయుగ పాలన అందిస్తానన్నారు. ఇంత వరకు ఏ ముఖ్యమంత్రి అందించని పాలన అందిస్తానని ప్రకటించారు. కానీ ఆ ప్రకటనను హైలెట్ చేస్తూ ఏ పత్రిక కూడా ఆ వార్తని ప్రచురించలేదు. ముఖ్యమంత్రి అవుతానన్న వ్యక్తి వేరే పార్టీకి మద్దతు ఇచ్చే అవకాశం లేదు. మరి రాజకీయ సమీకరణాలు ఏ విధంగా రూపాంతరం చెందుతాయో వేచి చూడాల్సిందే.

