ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఏజన్సీలను వణికిస్తున్న చలి
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా చాలా ప్రాంతాలను చలి వణికిస్తోంది. అల్లూరి జిల్లాలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయాయి. నిన్నటి వరకు 13 డిగ్రీలు వరకు నమోదైన ఉష్ణోగ్రతలు ఇవాళ సింగిల్ డిజిట్‌కు చేరాయి. చింతపల్లిలో 7 డిగ్రీలు, మినుములూరులో 8 డిగ్రీలు, పాడేరులో 10 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం 10 గంటలు అవుతున్నా పొగమంచు వీడకపోవడంతో ప్రజలు ఇళ్ల నుండి బయటకు వచ్చేందుకు బెదురుతున్నారు.