Breaking Newshome page sliderHome Page SliderNational

అదానీ తో ఆంధ్ర సీఎం

అదానీ గ్రూప్ చైర్మన్ గౌతం అదానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తో బుధవారం భేటీ అయ్యారు. ప్రత్యేక విమానంలో విజయవాడ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న ఆయన, అక్కడి నుంచి చంద్రబాబు నివాసానికి వెళ్లి పలు అంశాలపై చర్చించారు.ఈ సమావేశంలో ఏపీలో పెట్టుబడులపై ప్రధానంగా చర్చలు జరిగాయి. గౌతం అదానీ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ కరణ్ అదానీ విశాఖలో జరిగిన ఇన్వెస్టర్ సమ్మిట్‌లో రూ.1 లక్ష కోట్ల పెట్టుబడులను ప్రకటించారు. రాబోయే 10 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్‌లో పోర్టులు, సిమెంట్, డేటా సెంటర్లు, ఎనర్జీ, అడ్వాన్స్‌డ్ మాన్యుఫాక్చరింగ్ వంటి రంగాల్లో అదానీ గ్రూప్ పెట్టుబడులు పెట్టనున్నట్లు చెప్పారు.అదే సమయంలో, విశాఖలో గూగుల్ ఏఐ హబ్ నిర్మాణంలో అదానీ గ్రూప్ పాలుపంచుకుంటోంది. ఈ అంశాలపై భేటీలో చర్చ జరిగిందని తెలుస్తోంది. కానీ ఈ భేటీ గురించి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.