Home Page SliderNational

అటు ప్రణీత- ఇటు పూజిత.. పోజులు సూపర్..

ఒకప్పుడు టాలీవుడ్‌లో స్టార్ హీరోల చిత్రాల్లో నటించి ఫుల్ బిజీగా ఉండేది ప్రణీత సుభాష్. కానీ ఆ తర్వాత పెళ్లి, పిల్లలు అంటూ కెరీర్‌కి కాస్త బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది. ప్రస్తుతం మరోసారి ఇండస్ట్రీలో బిజీ అవుతోంది ఈ బ్యూటీ. మరోవైపు తెలుగు అందం పూజిత పొన్నాడ చిన్న చిత్రాల్లో నటిస్తూ కెరీర్‌ను కొనసాగిస్తోంది.

కన్నడ అందం ప్రణీత సుభాష్ డెలివరీ తర్వాత మళ్లీ కెరీర్‌లో బిజీ అవుతోంది. ప్రస్తుతం పలు కన్నడ సినిమాల్లో ఈ బ్యూటీకి ఆఫర్లు వస్తున్నాయి. కానీ తెలుగులో మాత్రం పెద్దగా పట్టించుకోవడం లేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం గ్లామర్ ట్రీట్ ఇస్తుంది ప్రణీత. మరోవైపు వైజాగ్ పిల్ల పూజిత పొన్నాడకి ఎంత అందం ఉన్నా అవకాశాలు మాత్రం పెద్దగా లేవు. అప్పుడెప్పుడో రంగస్థలంలో ఓ పాత్ర వచ్చినా అది పూజిత కెరీర్‌కి పెద్దగా ఉపయోగపడలేదు. ఇక ఈ బ్యూటీ తాజాగా షేర్ చేసిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.