పంత్ పై కోపంతో టివిని పగలగొట్టిన యాంకర్
భారతదేశంలో క్రికెట్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. దేశం మొత్తాన్ని ఒకే తాటిపై నడిపించే ఈ ఆటపై అభిమానులు ఎక్కువగా భావోద్వేగాలను ప్రదర్శిస్తుంటారు. క్రికెట్ ప్రేమికులు తమ అభిమాన జట్టు గెలిచినప్పుడు సంబరాలు చేసుకుంటే, ఓడిపోయినప్పుడు తీవ్ర నిరాశకు గురవుతారు. ఈ ఉద్వేగాల ప్రభావం కేవలం అభిమానులకే కాదు, మీడియా వర్గాల్లో కూడా కనిపిస్తోంది. తాజాగా జరిగిన ఓ సంఘటన ఇది మరోసారి నిరూపించింది. IPL 2025లో రిషబ్ పంత్ తన ఆటతీరు ద్వారా అభిమానులను నిరాశపరిచాడు. LSG కెప్టెన్‌గా ఉన్న పంత్ తన బ్యాటింగ్‌లో నిలకడలేమిగా ఆడాడు.ఇది అభిమానులకు అసహనానికి కారణమైంది. ముఖ్యంగా SRH, LSG మధ్య జరిగిన మ్యాచ్‌లో అతని ప్రదర్శన అంచనాలను మించలేదు. తొలి మ్యాచ్‌లో డకౌట్ అయిన అతను, SRHతో జరిగిన మరో మ్యాచ్‌లో కేవలం 15 పరుగులకే రన్ అవుట్ అయ్యాడు. ఈ పరిణామాల నేపథ్యంలో ఓ స్పోర్ట్స్ యూట్యూబ్ ఛానెల్‌లో జరిగిన ఓ చర్చలో, పంత్ ఆటతీరు పట్ల అసహనం వ్యక్తమైంది. విక్రాంత్ గుప్తా తోపాటు ఇతర క్రికెట్ విశ్లేషకులు పాల్గొన్న ఈ చర్చ గొప్ప వాదనల కంటే భావోద్వేగాలను ఎక్కువగా ప్రదర్శించింది. పంత్ బ్యాటింగ్ పట్ల తీవ్ర అసంతృప్తిగా ఉన్న ఓ జర్నలిస్ట్, లైవ్ షోలో ఆగ్రహంతో టీవీపై ఒక వస్తువును విసిరి పగలగొట్టాడు.